నమస్తే!
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ఈ బ్లాగ్ ప్రపంచానికి నేను కొత్తే అయినా, బ్లాగులు నాకు కొత్త కాదు.
ఎన్నో ఏళ్ళుగా బ్లాగులు చదువుతున్నాను.
ఎప్పటినుండో రాయాలని అనిపించినా ఎందుకో కుదరలేదు.
నిజం చెప్పాలంటే, కుదరలేదనడం కంటే ఎప్పుడూ ప్రయత్నించలేదనే చెప్పాలి.
ఇన్నేళ్ళ నా జీవితంలో ఎందరితోనో ఆత్మీయ పరిచయం... మరెన్నో మధుర స్మృతులు...
తలుచుకొంటేనే నవ్వొచ్చే విషయాలు, తలుచుకొని తలుచుకొని నవ్వుకొనే సంగతులు, పాటలు,
పాఠాలు, గుణపాఠాలు, ఆటలు, కొట్లాటలు, ఎన్నో, మరెన్నో....
అవన్నీ కాక పోయినా కొన్నైనా మరిచిపోకుండా అక్షరబధ్ధం చేసుకొని దాచుకోవాలనే ఈ నా చిన్ని ప్రయత్నం.
ఈ బ్లాగ్ కేవలం నా జ్ఞాపకాలను పంచుకోవడానికే తప్ప మరే
ఇతర ఉద్దేశ్యాలు నాకు లేవు.
విజ్ఞానం పంచాలనో లేదా ఎవరినో ఎడ్యుకేట్ చేయాలనో, ఉద్ధరించేయాలనో, నన్ను నేను నిరూపించుకోవాలనో నాకస్సలు లేదు.
వాదాలు, వివాదాలు , ఆశించి వస్తే మాత్రం ఆశాభంగం తప్పదు.
అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలన్నారు పెద్దలు.
నొప్పింపక తా నొవ్వక అని కూడా అన్నారు కదండీ!!!
మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలతో
శ్రీ
శ్రీకరం! శుభం!! శుభారంభం!!!
రిప్లయితొలగించండిమొదటి కామెంట్ నీదవడంతో తప్పకుండా శుభారంభమే.
రిప్లయితొలగించండిశుభప్రదంగా ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు.